north korea: ట్రంప్ అగ్గి రాజేశాడు... దావానలం దహించనుంది: ఉత్తర కొరియా

  • అణు పరీక్షలు జరిగి తీరుతాయి
  • అమెరికాతో సమానమని నిరూపించుకుంటాం
  • అమెరికాలోని ఏ ప్రదేశాన్నైనా కొట్టగలం
  • ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి

అమెరికా అధ్యక్షుడు అగ్గి రాజేశాడని, అందుకు ప్రతిఫలంగా దావానలం దహించక మానదని నార్త్ కొరియా వ్యాఖ్యానించింది. రష్యా ప్రభుత్వ రంగ న్యూస్ ఏజన్సీ 'టాస్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన నార్త్ కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో, అమెరికా తగిన మూల్యాన్ని చెల్లించే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. తమ దేశంలో సాగుతున్న అణు పరీక్షలు కేవలం దేశ రక్షణ నిమిత్తం ఉద్దేశించనవేనని స్పష్టం చేసిన ఆయన, హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో తాము యూఎస్ లోని ప్రధాన భూభాగాలను చేరుకోగలమన్న సంకేతాలు వెలువడ్డాయని, వాటిని గురించి తెలుసుకున్న అమెరికా, మరింతగా భయపడుతూ ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని చూస్తోందని ఆరోపించారు.

తమకు సంబంధించినంత వరకూ శాంతి, రక్షణ ముఖ్యమని, దేశ రక్షణ కోసం ఎంత దూరమైనా వెళతామని చెప్పారు. కేవలం ట్రంప్ వైఖరి కారణంగానే ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, తమ వద్ద మాత్రమే ఆయుధాలు ఉండాలనడం, ఇతరుల వద్ద వద్దని చెప్పడం అమెరికాకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. అమెరికాతో సమతుల్యాన్ని సాధించేలా ఆయుధాలను పెంచుకోవాలన్న తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.

More Telugu News