Pakistan: ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు భారీ ఎదురుదెబ్బ!

  • ఎంఎంఎల్‌‌ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన ఎన్నికల కమిషన్
  • మోకాలడ్డేసిన హోం మంత్రిత్వ శాఖ 
  • ఉగ్రవాద సంస్థలతో సంబంధాలుండడమే కారణం

పాకిస్థాన్ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ (ఈసీపీ) భారీ షాకిచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న అతడి ఆశలపై నీళ్లు చల్లింది. హఫీజ్ ప్రారంభించిన రాజకీయ పార్టీ మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించింది. జమాత్-ఉద్-దవా (జేయూడీ) చీఫ్ అయిన హఫీజ్ ఇటీవల ఎంఎంఎల్‌ను ప్రారంభించాడు.

లష్కరే తాయిబా (ఎల్ఈటీ), జేయూడీతో ఎంఎంఎల్‌కు సంబంధాలున్నాయని, కాబట్టి ఆ పార్టీని రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ గత నెలలో పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ ఈసీపీకి లేఖ రాసింది. ఎంఎంఎల్ లాయర్ల వాదనలు విన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సర్దార్ ముహమ్మద్ రజాఖాన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు హోంమంత్రిత్వ శాఖను సంప్రదించి ఉంటే బాగుండేదని  అన్నారు.

More Telugu News