terrorists: బందిపొర సెక్టార్ లో హోరా హోరీ కాల్పులు.. ఒక ఉగ్రవాదిని పట్టుకున్న జవాన్లు!

  • బందిపొర సెక్టార్ పరిధిలో ఉగ్రవాదులపై సమాచారం
  • తనిఖీలు నిర్వహించిన జవాన్లు
  • కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, ఇద్దరు జవాన్లు హతం
  • ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపి, ఒకరిని పట్టుకున్న జవాన్లు

జమ్మూకశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. బందిపోరా సెక్టార్ లోని సరిహద్దుల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన ఉగ్రవాదులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఇద్దరు జవాన్లను కాల్చి చంపారు. దీంతో రంగంలోకి దిగిన జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిపడేశారు. అనంతరం ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. 

More Telugu News