team india: ఆడినా.. ఆడకున్నా రికార్డే... నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ రికార్డు ఇదే

  • ఆసీస్ తో రెండో టీ20లో డకౌట్ అయిన కోహ్లీ
  • 48 మ్యాచ్ ల తరువాత డకౌట్ అయిన వైనం 
  • అత్యధిక ఇన్నింగ్స్ లు ఆడిన తరువాత డకౌట్ అయిన ఆటగాడిగా కోహ్లీ కొత్త రికార్డు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడినా, ఆడకున్నా రికార్డు నమోదవుతోంది. గువహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఆసీస్ ఆటగాళ్లు జూలు విదిల్చి అన్ని విభాగాల్లో రాణించడంతో టీమిండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ లో 48వ టీ20 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి తొలిసారి డకౌట్ గా పెవిలియన్ చేరాడు. జాసన్ బెహ్రన్ డార్ఫ్ విసిరిన బంతిని అంచనా వేయడంలో తడబడ్డ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు.

 దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఇన్నింగ్స్ లు ఆడిన తరువాత డకౌట్ అయిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ పేరిట ఉండడం విశేషం. 40 టీ20 మ్యాచ్ లు ఆడిన తరువాత షోయబ్ మాలిక్ డకౌట్ అయ్యాడు. దానిని సవరించిన కోహ్లీ 48 మ్యాచ్ ల తరువాత డకౌట్ అయ్యాడు. కోహ్లీ, షోయబ్ తరువాతి స్థానాల్లో యువరాజ్ సింగ్ (39), షెన్వారీ (38), ఇయాన్ మోర్గాన్ (35), బ్రెండన్ మెకల్లమ్ (33), గ్రేమ్ స్మిత్ (31) ఉన్నారు.

More Telugu News