america: హ్యాకింగ్ కు గురైన దిగ్గజ కంపెనీ డెలాయిట్!

  • డెలాయిట్ పై దాడి చేసిన హ్యాకర్లు
  • 350 క్లయింట్ల వివరాల తస్కరణ
  • డేటా చోరీపై పెదవి విప్పని డెలాయిట్
  • ఆందోళనలో అమెరికా

సాఫ్ట్ వేర్ దిగ్గజం డెలాయిట్‌ కు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. డెలాయిట్ కు చెందిన సర్వర్‌ ను దుండగులు హ్యాక్‌ చేసినట్టు తెలుస్తోంది. సంస్థకు చెందిన 350 మంది క్లయింట్ల వివరాలను హ్యాకర్లు తస్కరించినట్టు తెలుస్తోంది. ఇందులో అమెరికా ప్రభుత్వ డిపార్ట్ మెంట్లు కూడా ఉండడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఒక అంతర్జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. డెలాయిట్ పై హ్యాక్ చేసిన హ్యాకర్లు ఊహించినదానికంటే ఎక్కువ డేటాను చోరీ చేసి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.

 అయితే కంపెనీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని డెలాయిట్ ఈ హ్యాకింగ్ పై పెదవి విప్పడం లేదని తెలుస్తోంది. కేవలం ఆరుగురు క్లయింట్లకు సంబంధించిన సమాచారం మాత్రమే తస్కరణకు గురైందని పేరు చెప్పేందుకు ఇష్టపడని వ్యక్తి సమాచారం ఇచ్చారని ఆ కథనం తెలిపింది. అలాగే అమెరికాకు చెందిన స్టేట్, ఎనర్జీ, హోం ల్యాండ్‌ సెక్యూరిటీ, డిఫెన్స్ డిపార్ట్‌ మెంట్లకు చెందిన కీలక వివరాలు తస్కరణకు గురయ్యాయని తెలుస్తోంది. దీంతో అమెరికా ఆందోళనలో పడినట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News