cricket: బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఆదిలోనే ఎదురుదెబ్బలు!

  • గువహటి వేదిక‌గా టీమిండియా, ఆసీస్ మ‌ధ్య రెండో టీ20
  • ఇప్పటికే వన్డే సిరీస్ ను కోల్పోయిన ఆసీస్
  • టీ20ల్లోనైనా గెలవాలని పట్టుదల
  • రెండు వికెట్లు కోల్పోయిన భారత్

గువహటి వేదిక‌గా టీమిండియా, ఆసీస్ మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా జ‌ట్టులో వార్న‌ర్ (కెప్టెన్‌), ఫించ్‌, మ్యాక్స్‌వెల్‌, టీఎం హెడ్‌, హెన్రిక్‌, స్టొయినిస్‌, పైనె, కౌల్ట‌ర్ నైల్‌, టై, జంపా, బెహెండ్రోఫ్ ఉన్నారు.

భార‌త జ‌ట్టులో శిఖ‌ర్ ధావ‌న్‌, రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ (కెప్టెన్‌), మ‌నీశ్ పాండే, ధోనీ, కేదార్ జాదవ్‌, హార్దిక్ పాండ్యా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, కుల్దీప్ యాద‌వ్‌, చాహెల్‌, బుమ్రా ఉన్నారు. మొదటి టీ20 మ్యాచులో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్ ను కోల్పోయిన ఆసీస్ టీ20లో నైనా గెలవాలని పట్టుదలతో ఉంది.  
 
బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ రోహిత్ శర్మ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెహెండ్రోఫ్ బౌలింగ్ లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ కూడా బెహెండ్రోఫ్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు.

More Telugu News