ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం ఉంటుందన్న రామ్ గోపాల్ వర్మ

Tue, Oct 10, 2017, 05:07 PM
  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కోసం నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు
  • ఎమ్మెల్యే రోజాకు కూడా సినిమాలో ఛాన్స్ ఉంటుంది
  • పలమనేరులో ప్రకటించిన వర్మ
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత అయిన వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి (పలమనేరు) ఈరోజు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్రంలోని పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, చిత్ర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా వెనుకాడబోమని అన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడకుండా సినిమాను నిర్మిస్తామని తెలిపారు. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad