rajamouli bd: ‘మాస్ట‌ర్ స్టోరీ టెల్ల‌ర్, ట్రెండ్ సెట్ట‌ర్‌ రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చంద్రబాబు సహా పలువురు ప్రముఖుల విషెస్

  • రాజమౌళికి మోహన్ లాల్, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, తరణ్ ఆదర్శ్ శుభాకాంక్షలు
  • అసాధారణ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఉన్న జ‌క్క‌న్న
  • రాజ‌మౌళి జీనియ‌స్ అంటూ ప్రశంసలు

ఓట‌మి ఎరుగ‌ని ధ‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు రాజ‌కీయ సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ‘తెలుగు సినిమా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీకున్న అద్భుత క‌ళా నైపుణ్యంతో ఇలాగే స్క్రీన్‌పై మ్యాజిక్‌లు చేయాల‌ని కోరుకుంటున్నాను’ అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంగ్లిష్ లో ట్వీట్ చేశారు.

మరి కొద్ది సేపటికే ‘తెలుగు సినీ దర్శక దిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరెన్నో అద్భుతమైన చిత్రాలను తీయాలని కోరుకుంటున్నాను’ అని తెలుగులోనూ ట్వీట్ చేశారు. సింహాద్రికి అప్పన్న, భద్రాద్రికి రామన్న, తెలుగు సినిమాకి జక్కన్న అంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇంకా ఎవ‌రెలా శుభాకాంక్ష‌లు తెలిపారంటే...

మోహ‌న్‌లాల్‌: హ్యాపీ బ‌ర్త్ డే.. మీకు భ‌విష్య‌త్తులోనూ ఇలాగే మంచి విజ‌యాలు ల‌భించాలి.

మంచు మ‌నోజ్‌:  పెద్ద మ‌న‌సు, గొప్ప కుటుంబ విలువ‌లు, అసాధారణ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఉన్న జ‌క్క‌న్నకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌: మ‌ంచి ఆరోగ్యంతో, సంతోషంతో, సంతృప్తినిచ్చే విజ‌యాల‌తో మీరు ముందుకు వెళ్లాల‌ని కోరు‌కుంటున్నాను.. హ్యాపీ బ‌ర్త్ డే స‌ర్‌.

సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆదర్శ్‌:  మాస్ట‌ర్ స్టోరీటెల్ల‌ర్, ట్రెండ్ సెట్ట‌ర్‌, జీనియ‌స్ రాజ‌మౌళి జీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. 

More Telugu News