ram gopal varma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై వర్మ ప్రకటన

  • ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం
  • అక్టోబర్ లో విడుదల
  • పలమనేరులో ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్తూరు జిల్లా పలమనేరులో హల్ చల్ చేశారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నిర్మాత రాకేష్ రెడ్డితో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఫిబ్రవరిలో షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని... ఆయన జీవితం మహాభారతం వంటిదని... ఇందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నామని తెలిపారు. 

More Telugu News