big boss 11: స‌ల్మాన్ ఖాన్‌కి అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌తో సంబంధాలున్నాయి.... జుబైర్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసిన బిగ్‌బాస్ మాజీ కంటెస్టంట్‌
  • దావూద్ కుటుంబంతో సంబంధాలు లేవంటూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై స్పంద‌న‌
  • ఇటీవ‌ల బిగ్‌బాస్ ఇంటి నుంచి బ‌య‌టికొచ్చిన జుబైర్‌

ప్రారంభ‌మైన మొద‌టి వారంలోనే హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 11 వివాదాలకు అడ్డాగా మారింది. ఇంట్లో అస‌భ్య‌ప‌ద‌జాలం వాడి, స‌భ్యుల‌ను బెదిరించిన కార‌ణంగా మొద‌టి వారంలో ఎలిమినేట్ అయిన జుబైర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ మీద కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. దావూద్ కుటుంబీకుడిన‌ని చెప్పుకుంటూ బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన జుబైర్ సోమ‌వారం నాడు త‌న ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో బిగ్‌బాస్ కార్య‌క్ర‌మం గురించి, స‌ల్మాన్ ఖాన్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

స‌ల్మాన్ ఖాన్‌కి అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌తో సంబంధాలు ఉన్నాయ‌ని, వారికి భ‌య‌ప‌డుతున్నాడ‌ని, అత‌ని సినిమాల‌కు డ‌బ్బు ఎక్క‌డినుంచి వ‌స్తుందో త‌న‌కు తెలుసున‌ని జుబైర్ వీడియోలో పేర్కొన్నాడు. అలాగే తాను దావూద్ కుటుంబానికి చెందిన వాడ‌ని చెప్పుకుంటూ, ప్ర‌చారం కోసం అత‌ని పేరు వాడుకుంటున్న‌ట్లుగా వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు జుబైర్ స‌మాధానం చెప్పాడు.

తాను ఒక‌టి చెబితే క‌ల‌ర్స్ టీవీ వాళ్లు మ‌రొక‌టి ప్ర‌చారం చేశారని, టీఆర్‌పీల కోసం ప్రోమోల్లో తాను చెప్పిన విష‌యాల‌ను త‌ప్పుగా చూపించార‌ని జుబైర్ అన్నాడు. అలాగే బిగ్‌బాస్ ఇంట్లో అస‌భ్య ప‌ద‌జాలం వాడ‌టంపై కూడా జుబైర్ మాట్లాడాడు. `అర్షి ఖాన్ ఖురాన్‌ను అతిక్ర‌మించింది. శివాని దుర్గ‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించింది. ఇత‌ర స‌భ్యులు తినే ఆహారంలో ఉమ్మి వేసింది. అందుకే ఆమెను తిట్టాను. క‌ల‌ర్స్ వాళ్లు నేను తిట్టింది మాత్ర‌మే చూపించి నా ప‌రువు తీశారు` అన్నాడు. క‌ల‌ర్స్ టీవీ వాళ్లే త‌న దగ్గ‌రికి వ‌చ్చి బిగ్‌బాస్‌లో పాల్గొనాల‌ని కోరార‌ని, వారితో రెండేళ్ల ఒప్పందం ఉంద‌ని, బిగ్‌బాస్ ఇంట్లో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టికీ రెండేళ్ల పాటు క‌ల‌ర్స్ వాళ్లు పారితోషికం ఇస్తార‌ని జుబైర్ వీడియోలో వివ‌రించాడు.

More Telugu News