bihar: కట్నం తీసుకునే పెళ్లిళ్లకు వెళ్లకండి... పిలుపునిచ్చిన బిహార్ ముఖ్యమంత్రి

  • తనను పెళ్లికి పిలిచే ముందు కట్నం తీసుకోవడం లేదని ప్రకటన చేయాలన్న నితీశ్
  • తాను కట్నం తీసుకోలేద‌ని వ్యాఖ్య
  • వ‌ర‌క‌ట్న నిషేధంపై ప్ర‌చార కార్య‌క్ర‌మాలు

క‌ట్నం తీసుకునే పెళ్లిళ్ల‌కు హాజ‌రు కావొద్ద‌ని బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. అలాగే త‌న‌ను పెళ్లిళ్ల‌కు ఆహ్వానించే ముందు అది వ‌ర‌క‌ట్న ర‌హిత పెళ్లి అని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించే లోక్‌సంవాద్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న త‌ర్వాత ఆయ‌న ప్ర‌సంగించారు.

త‌న పెళ్లి 1979లో జ‌రిగింద‌ని, తాను క‌ట్నం తీసుకోలేద‌ని ఆయ‌న చెప్పారు. వ‌ర‌క‌ట్న వేధింపులు, మ‌ర‌ణాల్లో బిహార్ రెండో స్థానంలో ఉన్నద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వ‌ర‌క‌ట్న నిషేధాన్ని అమ‌లు చేసేందుకు ప్ర‌జ‌ల సాయం కావాల‌ని ఆయ‌న కోరారు. ఈ భావ‌న‌ను ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే మాన‌వ‌హారం వంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం చేపడుతుంద‌ని ఆయ‌న తెలియజేశారు.

More Telugu News