rajasekhar: కుటుంబ సభ్యులతో వాగ్వాదం.. ఆగ్రహంతో కారు తీసుకుని రోడ్డెక్కిన హీరో రాజశేఖర్.. అంతలోనే యాక్సిడెంట్!

  • తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన రాజశేఖర్
  • ఎన్నాళ్లిలా? అంటూ ప్రశ్నించిన కుటుంబ సభ్యులు
  • ఆగ్రహానికి గురై నిద్రమాత్రలు వేసుకుని, రోడ్డెక్కిన రాజశేఖర్
  • బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి, ఆల్కహాల్ తీసుకోలేదని, కుటుంబంతో మాట్లాడి డిప్రెషన్ లో ఉన్నాడని నిర్ధారించిన పోలీసులు

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్‌ మొన్న రాత్రి తన కారుతో యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్కహాల్ తీసుకుని యాక్సిడెంట్ చేశాడని బాధితుడు రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, అసలు విషయం గుర్తించారు. రాజశేఖర్ నిద్రమాత్రలు మింగడంతో మత్తుకు గురై యాక్సిడెంట్ కు కారణమయ్యారని తెలుస్తోంది. రాజశేఖర్‌ తల్లి ఇటీవల మరణించారు. దానిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆయన మూడీగా మారిపోయారు. నిన్న ఆమె కర్మకాండలు జరగాల్సి ఉంది.

ఈ క్రమంలో ఆయన ముభావంగా.. దిగాలుగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, ‘‘చనిపోయిన తల్లి మళ్లీ రాదు. ఇలా ఎన్ని రోజులు డల్‌ గా ఉంటావు? పనిలో పడితే అన్నీ సర్దుకుంటాయి’’ అంటూ హితవుపలికే ప్రయత్నం చేశారు. దీంతో రాజశేఖర్ కు కోపం ముంచుకొచ్చింది.

ఆ తరువాత జరిగిన స్వల్ప వాగ్వాదంతో మరింత ఆగ్రహానికి గురైన రాజశేఖర్ తన కారు (ఏపీ 13ఈ1234 నంబరు) తీసుకుని బంజారాహిల్స్‌ లోని తన ఇంటి నుంచి శంషాబాద్‌ వైపుగా.. అటు నుంచి మెహిదీపట్నం వైపు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవే పైనుంచి వస్తూ నిద్రమాత్రలు వేసుకున్నారు. శివరాంపల్లి పిల్లర్‌ నంబరు 240 వద్ద కారు ఆపి, సిగరెట్‌ తాగి కారును తీసిన కాసేపటికే రాంరెడ్డి కారును యాక్సిడెంట్ చేశారు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేయడం, వారు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడం, అందులో 20 ఎంఎల్ గా చూపించడంతో కారణాలు ఆరాతీసి రాజీకి రావడంతో వివాదం ముగిసిపోయింది. 

More Telugu News