rain: హైదరాబాద్ లో మరోసారి దంచికొట్టిన వర్షం!

  • వాహ‌న‌దారుల ఇబ్బందులు
  • పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ 
  • మ‌రో 48 గంట‌లు ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం

హైద‌రాబాద్‌లో మ‌రోసారి జోరు వాన కురుస్తోంది. వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. న‌గ‌రంలోని అంబ‌ర్‌పేట్‌, విద్యాన‌గ‌ర్‌, రామాంత‌పూర్‌, తార్నాక‌, హ‌బ్సిగూడ, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, నాగార్జున స‌ర్కిల్‌, అమీర్ పేట్, ఎస్సార్‌న‌గ‌ర్‌, ఎర్ర‌గ‌డ్డ‌, యూస‌ఫ్ గూడ‌, మోతీ న‌గ‌ర్, భ‌ర‌త్ న‌గ‌ర్ ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డుతోంది. ప‌లు కూడ‌ళ్ల వ‌ద్ద ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. క‌ర్ణాట‌క‌, ఒడిశా, తెలంగాణ మీదుగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం స్థిరంగా ఉంద‌ని, మ‌రో 48 గంట‌ల పాటు ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డ‌వ‌చ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 

More Telugu News