siddharth: హారర్ థ్రిల్లర్లో ఆసక్తికరంగా సిద్ధార్థ్ పాత్ర!

  •  త్రిభాషా చిత్రంలో సిద్ధార్థ్
  •  కథానాయికగా ఆండ్రియా
  •  ఆడియన్స్ లో ఆసక్తి 

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో హీరోగా సిద్ధార్థ్ కి మంచి గుర్తింపు వుంది. అయితే సరైన కథలను ఎంచుకోకపోవడం వలన, ఆయనకి వరుస పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. ఫలితంగా ఈ మూడు భాషల్లోను ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తనే నిర్మాతగా ఒక సినిమాను నిర్మించి, ఈ మూడు భాషల్లోను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు.

తమిళంలో 'అవళ్' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో 'గృహం' పేరుతోనూ .. హిందీలో 'ది హౌస్ నెక్స్ట్ డోర్' పేరుతోను నవంబర్లో విడుదల చేయనున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ 'న్యూరో సర్జన్'గా కనిపిస్తాడు. ఈ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. నిర్మాతగాను .. హారర్ చిత్రాలు చేయడంలోను సిద్ధార్థ్ కి అనుభవం వుంది. మిలింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆయనకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.      

More Telugu News