sanjay leela bhansali: సంజ‌య్ లీలా భ‌న్సాలీ `ప‌ద్మావ‌తి` ట్రైల‌ర్ విడుద‌ల‌

  • అంచ‌నాలు రెట్టింపు చేసిన దీపికా, ర‌ణ్‌వీర్‌, షాహిద్‌ల న‌ట‌న
  • ఆస‌క్తి క‌లిగిస్తున్న భారీ సెట్టింగులు, యుద్ధ స‌న్నివేశాలు
  • డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకి

రాజ్‌పుత్‌ మ‌హారాణి ప‌ద్మావ‌తి క‌థ‌తో ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ప‌ద్మావ‌తి` చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇప్ప‌టికే ప‌ద్మావ‌తిగా దీపికా ప‌దుకునే, ఆమె భ‌ర్త రావ‌ల్ ర‌త‌న్ సింగ్‌గా షాహిద్ క‌పూర్‌, అల్లా వుద్దీన్ ఖిల్జీగా ర‌ణ్‌వీర్ సింగ్‌ల ఫ‌స్ట్‌లుక్‌లు సినిమాపై భారీ అంచ‌నాలు క‌లిగేలా చేశాయి.

ఇవాళ విడుద‌లైన ట్రైల‌ర్‌లో వారి ఆహార్యాభిన‌యాలు ఆ అంచ‌నాలను రెట్టింపు చేశాయి. ట్రైల‌ర్‌లో చూపించిన భారీ సెట్టింగులు, యుద్ధ స‌న్నివేశాలు ఆస‌క్తిని పెంచుతున్నాయి. రాజ్‌పుత్ వంశ‌స్థుల ఖ్యాతిని వివ‌రిస్తూ ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ చివ‌ర్లో ప‌ద్మావ‌తిగా దీపికా ప‌దుకునే చెప్పిన `రాజ్‌పుత్‌ల ఖ‌డ్గంలో ఎంత శ‌క్తి ఉందో.. అంతే శ‌క్తి రాజ్‌పుత్ రాణుల గాజుల్లో కూడా ఉంటుంది` అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. అల్లా వుద్దీన్ ఖిల్జీగా ర‌ణ్‌వీర్ సింగ్‌ని చూపించిన విధానం కూడా బాగా ఆక‌ట్టుకుంటోంది. డిసెంబ‌ర్ 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకి రానుంది.

More Telugu News