Pakistan: బౌలింగ్ ఎలా చేయాలో మరచిపోయిన పాక్ క్రికెటర్ వాహెబ్ రియాజ్... చిర్రెత్తిపోయిన కోచ్ మిక్కీ ఆర్థర్ ఏం చేశాడో చూడండి!

  • వరుస ఓటములతో కుదేలవుతున్న పాక్
  • చెత్త రికార్డును తన పేరిట రాసుకున్న బౌలర్ వాహెబ్ రియాజ్
  • ఒక్క బాల్ వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించి విఫలం
  • విసిగిపోయిన అంపైర్, కోచ్, కెప్టెన్

ఓ వైపు నిధుల్లేని క్రికెట్ బోర్డు, మరో వైపు నుంచి వరుస ఓటములు కుదేలు చేస్తున్న వేళ, పాకిస్థాన్ బౌలర్ వాహెబ్ రియాజ్ ఓ అరుదైన చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. బాల్ ఎలా వేయాలో మరచిపోయి, ఏకంగా ఐదుసార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.

శ్రీలంకతో దుబాయ్ లో టెస్టు మ్యాచ్ ఆడుతున్న వేళ, పాక్ తన పేలవమైన ఫామ్ నే కొనసాగించింది. ఇక 111వ ఓవర్ లో నాలుగో బంతిని వేయడానికి ముందు రియాజ్ మైండ్ బ్లాంక్ అయిపోయిందేమో... బంతిని ఎలా విసరాలో తెలియక వరుసగా ప్రయత్నించి విఫలమయ్యాడు. సాధారణంగా క్రికెట్ లో బౌలింగ్ చేయడానికి వచ్చి, చేతిలోని బాల్ జారుతోందనో, లయ తప్పిందనో భావించే ఆటగాళ్లు అంపైర్ ముందుకు వచ్చి ఆగిపోయే సందర్భాలను చూస్తుంటాం.

కానీ ఒకసారి, రెండు సార్లు కాదు... వరుసగా ఐదు సార్లు అలానే చేశాడు వాహెబ్. దీంతో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, మైదానంలోని అంపైర్ లు కూడా విసుగ్గా చూశారు. ఇక పాక్ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ కు చిర్రెత్తుకొచ్చి, పక్కనే ఉన్న ఆటగాడితో కోపంగా మాట్లాడుతూ లోపలికి వెళ్లిపోయాడు. ఇలా ఐదు సార్లు బాల్ వేసేందుకు ట్రై చేసి విఫలం కావడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారేమో.

More Telugu News