ram: బాబాయ్... ఇంత సోది ఎవడూ చదవడు, ఒక్క లైన్ లో చెప్పు: వర్మకు అభిమానుల మెసేజ్ లు

  • 30 ఏళ్ల క్రితం వర్మ రాసిన ఆర్టికల్ ఇప్పుడు వైరల్
  • అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నామన్న నెటిజన్లు
  • 1844 నాటి జర్మనీ, ఫ్రాన్స్ యుద్ధం గురించి రాసిన వర్మ

"ది ఐడియా దట్ కిల్డ్ 50 మిలియన్ పీపుల్" అంటూ రామ్ గోపాల్ వర్మ 30 ఏళ్ల క్రితం 'న్యూస్ టైమ్' పత్రికలో రాసిన ఆర్టికల్ ను నేడు ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకోగా, అభిమానులు వెరైటీగా స్పందిస్తున్నారు. నాజీలు, హిట్లర్ జరిపిన అమానుష హత్యాకాండపై 1844 నాటి పరిస్థితులను ఫ్రెడ్రిచ్ విల్ హెల్మ్ వైఖరిని, జర్మనీ, ఫ్రాన్స్ ల మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, రామ్ గోపాల్ వర్మ ఈ ఆర్డికల్ రాశారు.

ఇది కాస్త పెద్దగా ఉంది. ఇక నేటి తరం నెటిజన్లు దీన్ని చదివి అర్థం చేసుకోలేక అల్లాడుతున్నారు. ఈ ఆర్టికల్ తమకు అర్థం కావడం లేదని, ఏం రాశారన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పాలని రామ్ గోపాల్ వర్మ టైమ్ లైన్ లో మెసేజ్ లు పెడుతున్నారు. "ఇంత సోది ఎవడూ చదవడు" అని ఒకరు, "ఇది చదవాలంటే డిక్షనరీ పక్కన పెట్టుకోవాలి" అని ఒకరు, "విషయం ఏంటో ఒక్క లైన్ లో చెప్పు బాబాయ్" అని ఇంకొకరు, "ఈ ఆర్టికల్ ను మీ స్నేహితుడు సత్యేంద్ర రాసుంటాడు" అని మరొకరు ఇలా కామెంట్లు వెల్లువెత్తిస్తున్నారు.

ram

More Telugu News