akhil: భారీ రేటుకు 'హలో' ఓవర్సీస్ రైట్స్

  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్
  • కథానాయికగా కల్యాణి ప్రియదర్శిని
  • ముగింపు దశకి చేరుకున్న 'హలో' షూటింగ్
  • ఓవర్సీస్ మార్కెట్ పై విక్రమ్ కుమార్ ప్రభావం

అఖిల్ .. విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'హలో' సినిమా .. చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా, కల్యాణి ప్రియదర్శన్ నాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమా థియేటర్ రైట్స్ కి పోటీ పెరుగుతోంది. ఇక ఓవర్సీస్ రైట్స్ కి కూడా భారీ ఆఫర్ వచ్చింది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు గాను 5 కోట్లు చెల్లించడానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు.

 గతంలో అక్కడ విడుదలైన 'అఖిల్' నిరాశనే మిగిల్చింది. అయితే 'హలో' సినిమాకి అక్కడ ఈ స్థాయి రేటు పలకడానికి కారణం, దర్శకుడు విక్రమ్ కుమార్ అని అంటున్నారు. ఆయన తెరకెక్కించిన రొమాంటిక్ మూవీస్ అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్టుగా నాగార్జున చెప్పారు. అందువలన ఈ సినిమాకి ఈ స్థాయి ఆఫర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు.      

More Telugu News