sanjay dutt: సంజయ్ దత్ బయోపిక్ టైటిల్ ఖరారు!

  • 'సంజు' అనే పేరు ఖరారు!
  • హీరోగా నటిస్తున్న రణబీర్ కపూర్
  • ఇండస్ట్రీలో సంజయ్ ముద్దు పేరు సంజూయే
  • అదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు

బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద నటుల్లో ఒకరిగా, అక్రమంగా ఆయుధాలను కలిగివున్నాడన్న కేసులో జైలు శిక్షను కూడా అనుభవించి వచ్చిన సంజయ్ దత్ జీవిత చరిత్రపై రాజ్ కుమార్ హీరానీ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. వెండి తెరపై సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్న ఈ చిత్రానికి 'సంజు' అని పేరు పెట్టినట్టు బాలీవుడ్ సినీ న్యూస్ వెబ్ సైట్ 'పింక్ విల్లా డాట్ కామ్' పేర్కొంది.

కాగా, ఇండస్ట్రీలో సంజయ్ ని సంజూ బాబా అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకు అదే టైటిల్ పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చి టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. పరేష్ రావెల్, మనీషా కోయిరాలా తదితర సీనియర్లలతో పాటు సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్క శర్మ వంటి తారలు నటిస్తున్న చిత్రం వచ్చే సంవత్సరం మార్చి 30న విడుదల కానుంది.

More Telugu News