Swipe: అత్యంత చవక ధరలో అద్భుతమైన ఫోన్‌ను విడుదల చేసిన ‘స్వైప్’

  • ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ
  • నేటి నుంచి స్నాప్‌డీల్‌లో అందుబాటులో
  • విడుదల దేశీయ కంపెనీ స్వైప్

దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఎలైట్ టెక్నాలజీస్ అత్యంత చవక ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘ఎలైట్ ప్రొ’ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.6,999.

ఫీచర్లు: 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, 64 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో వెనక 13 ఎంపీ, ముందు 8 ఎంపీ కెమెరాలు అమర్చారు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌తో పనిచేస్తుంది. 2500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ‘ఎలైట్ ప్రొ’‌ను నేటి నుంచి ‘స్నాప్‌డీల్‌’లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

More Telugu News