Darul-Uloom Deoband: ముస్లిం మహిళలు కనుబొమ్మలు, జుత్తు కత్తిరించుకోవడానికి వ్యతిరేకంగా ఫత్వా

  • జారీ చేసిన ఇస్లామిక్ యూనివర్సిటీ
  • ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకమన్న దారుల్-ఉల్-దియోబంద్
  • అలా చేసుకోవడం వల్ల పురుషులు ఆకర్షితులవుతారని వివరణ

ముస్లిం మహిళలు తమ కనుబొమలు, జత్తు కత్తిరించుకోవడానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ యూనివర్సిటీ ఫత్వా జారీ చేసినట్టు దారుల్-ఉల్ దియోబంద్ మౌలానా కాజ్మి తెలిపారు. మహిళలు అలా కత్తిరించుకోవడం ఇస్లాంకు పూర్తిగా వ్యతిరేకమని ఆయన అన్నారు. ఇస్లామిక్ చట్టాలకు కూడా ఇది వ్యతిరేకమని, కాబట్టి కనుబొమ్మలు, జుత్తు కత్తిరించుకోవడానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

‘‘నా భార్య కనుబొమలు సరిదిద్దు కోవడానికి, జత్తు కత్తిరించుకోవడానికి ఇస్లామిక్ చట్టాలు అనుమతిస్తాయా? ’’ అని ఓ వ్యక్తి ఇస్లామిక్ యూనివర్సిటీని ప్రశ్నించాడు. అతడి ప్రశ్నకు దారుల్-ఉలూమ్ దియోబంద్ సమాధానం చెబుతూ మహిళలు ఇటువంటి పనులు చేయడం ఇస్లాం చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది.

దారుల్ ఇఫ్తా ప్రకారం అందాన్ని పెంచుకునేందుకు మహిళలు చేసే ఇటువంటి పది పనులపై నిషేధం ఉంది. అందులో హెయిర్ కట్ కూడా ఒకటని దారుల్ ఇఫ్తా హెడ్ సాదిక్ కాస్మి తెలిపారు. ముస్లిం మహిళలు బ్యూటీ పార్లర్లు, మేకప్‌లు వేసుకోరాదని ఆయన తెలిపారు. ఈ చర్యలు పురుషులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.

More Telugu News