India: ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు భారత్, ఈయూ ఒప్పందం

  • ఢిల్లీలో భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) సదస్సు
  • ఉగ్రవాదంపై పోరుకు ఒప్పందం
  • అతివాదం, తీవ్రవాదం, ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయం

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఒప్పందానికి వచ్చాయి. ఢిల్లీలో భారత్‌–ఈయూ 14వ సదస్సు జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్‌ యూనియన్ కౌన్సిల్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ఫ్రాన్సిజెక్‌ టస్క్, యూరోపియన్‌ యూనియన్ కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జంకర్ తదితర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పరస్పరం సహకరించుకోవాలన్న ఒప్పందానికి వచ్చారు. అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పోరాటంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అలాగే భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించినట్టు వారు వెల్లడించారు. అతివాదం, తీవ్రవాదం, ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించామని అన్నారు. 

More Telugu News