taapsee: తాప్సీ హాకీ నేర్చుకుంటున్నది అందుకే!

  •  తెరపైకి హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ బయోపిక్
  •  ఆయన పాత్రలో దిల్జీత్ సింగ్
  •  సందీప్ సింగ్ ప్రియురాలి పాత్రలో తాప్సీ
  •  ఆ పాత్ర కోసం హాకీలో శిక్షణ తీసుకుంటోన్న తాప్సీ

తెలుగు .. తమిళ సినిమాలు చేసిన తాప్సీకి హిందీ సినిమాలే బాగా కలిసొచ్చాయి. బాలీవుడ్ సినిమాలు ఆమెకు సక్సెస్ తో పాటు అవకాశాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మరింత క్రేజ్ తెచ్చిపెట్టే పాత్రలను అంగీకరిస్తూ వెళుతోంది. అలా తాజాగా ఆమె ఓ బయోపిక్ లో చేయడానికి అంగీకరించింది.

 ప్రముఖ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ పాత్రని దిల్జీత్ సింగ్ పోషించనున్నాడు. సందీప్ సింగ్ ప్రియురాలు కూడా హాకీ ప్లేయర్ కావడం విశేషం. ఆమె పాత్రలోనే తాప్సీ కనిపించనుంది. ఈ పాత్రను పండించడం కోసమే తాప్సీ హాకీలో శిక్షణ తీసుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సినిమా కూడా తనకి హిట్ తెచ్చిపెడుతుందనే తాప్సీ నమ్మకం నిజమవుతుందేమో చూడాలి.  

More Telugu News