sasikala: నేడే విడుదల... శశికళకు ఐదు రోజుల పెరోల్!

  • శశికళకు షరతులతో కూడిన పెరోల్ 
  • ఐదు రోజుల పాటు వ్యక్తిగత పనులకు మాత్రమే పరిమితం కావాలని ఆదేశం
  • రాజకీయ సంబంధ కార్యక్రమాల్లో తలదూరిస్తే పెరోల్ రద్దు చేస్తాం

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు ఐదురోజుల పెరోల్ లభించింది. తన భర్తకు అవయవమార్పిడి జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ పెరోల్ కు దరఖాస్తు చేసుకున్న శశికళకు షరతులతో కూడిన పెరోల్ మంజూరైంది. భర్తను చూసుకోవడం, వ్యక్తిగత పనులు చూసుకోవడం చేయాలని జైళ్ల శాఖ షరతులు విధించింది. ఒకవేళ శశికళ రాజకీయ సంబంధ కార్యక్రమాల్లో తలదూర్చితే పెరోల్ రద్దు చేస్తామని జైళ్ల శాఖ హెచ్చరించింది. మీడియా ప్రకటనలు కూడా చేయకూడదని ఆదేశించింది. బంధువుల ఇంట్లో ఉండాలని సూచించింది.

అయితే ఆమె కోరినట్టు 15 రోజుల పెరోల్ సాధ్యం కాదని చెబుతూ, కేవలం ఐదు రోజుల పెరోల్ ను మాత్రమే మంజూరు చేసింది. ఇప్పుడు తమిళనాట ఇదే ఆసక్తికర అంశంగా మారింది. శశికళను పార్టీ నుంచి బహిష్కరించడం, టీటీవీ దినకరన్ వర్గంపై సస్పెన్షన్ వేటు వేయడం తదితరాలపై శశికళ ఎలా స్పందిస్తుంది? ఆమె ఎలాంటి రాజకీయ వ్యూహాలు వేస్తుంది? అన్న విషయాలపై సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. మరోవైపు శశికళ నేటి మధ్యాహ్నం జైలు నుంచి విడుదలై నేరుగా చెన్నైలోని ఇళవరసి ఇంటికి చేరనున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళతారు. ఈ నేఫథ్యంలో శశికళతో పాటు అన్నాడీఎంకే నేతల కదలికలపై తమిళనాడు ప్రభుత్వం నిఘా వేసింది. 

More Telugu News