chief minister: ముఖ్య‌మంత్రిగా మ‌హేశ్ బాబు... ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్‌లుక్‌!

  • మ‌హేశ్ అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్
  • `భ‌ర‌త్ అను నేను` సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
  • చీఫ్ సెక్ర‌ట‌రీగా బ్ర‌హ్మాజీ?

`స్పైడ‌ర్‌` సినిమా తర్వాత మ‌హేశ్ బాబు నటిస్తున్న `భ‌ర‌త్ అనే నేను` చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో మ‌హేశ్ బాబు ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పాత్రకి త‌గ్గట్టుగానే మ‌హేశ్ సీఎంగా న‌డుస్తున్న లుక్‌ని చిత్ర‌యూనిట్ పంచుకుంది.

ప‌క్క‌న ఇద్ద‌రు గ‌న్‌మెన్‌లతో న‌డిచొస్తున్న స్టిల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌హేశ్ వెన‌కాల బ్ర‌హ్మాజీ కూడా ఈ స్టిల్‌లో ఉన్నాడు. బ‌హుశా ఆయ‌న చీఫ్ సెక్ర‌ట‌రీ పాత్రలో న‌టిస్తుండ‌వ‌చ్చ‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి కైరా అడ్వాణీ న‌టిస్తోంది.

More Telugu News