honor I9: 4 కెమెరాలు, 64 జీబీ మెమొరీతో వచ్చి ఆకర్షిస్తున్న స్మార్ట్ ఫోన్ ఇది!

  • 'ఐ9'ను విడుదల చేసిన ఆనర్
  • 5.9 అంగుళాల డిస్ ప్లే, 4 జీబీ ర్యామ్
  • 3,340 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ధర రూ. 17,999

ఆకర్షణీయమైన ఫీచర్లతో '9ఐ' పేరిట ఆనర్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. గత నెలలో చైనాలో విడుదలైన ఈ ఫోన్, ఇక ఇండియాలోనూ కస్టమర్ల కోసం రెడీగా ఉందని సంస్థ పేర్కొంది. ఈ నెల 14 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు సాగుతాయని, ప్లాటినమ్ గోల్డ్, నేవీ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో ఉంటాయని వెల్లడించింది.

ఇక ఫోన్ లోని ఫీచర్ల విషయానికి వస్తే, 5.9 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ ప్లే, మెటల్ డిజైన్, ముందువైపు 13, 2 మెగాపిక్సెల్, వెనుకవైపు 16, 2 మెగాపిక్సెల్ కెమెరాలు, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2.36 జీహెచ్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉంటాయి.

రెండు రోజుల స్టాండ్ బై టైమ్ ను అందించే ఫోన్.. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేస్తుందని, దీని ధర రూ. 17,999 అని ఆనర్ వెల్లడించింది. ఇదే సమయంలో 10,000 ఎంఏహెచ్ క్విక్ చార్జ్ పవర్ బ్యాంకును రూ. 2,339కి విడుదల చేస్తున్నామని, ప్రారంభ ఆఫర్ గా ఈ పవర్ బ్యాంకును 28వ తేదీలోగా రూ. 1,999కి ఆనర్ ఆన్ లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.

More Telugu News