venkatesh: వెంకటేశ్ హీరోగా 'తెలుగు మీడియం'?

  •  బాలీవుడ్లో సక్సెస్ ను సాధించిన 'హిందీ మీడియం'
  •  తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో నందినీ రెడ్డి
  •  ప్రధాన పాత్రకు వెంకటేశ్ ను ఎంచుకునే అవకాశం
  •  వెంకటేశ్ ఓకే చెప్పొచ్చనే టాక్  

ఇటీవల బాలీవుడ్ లో విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'హిందీ మీడియం' ఒకటి. ఇర్ఫాన్ ఖాన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. పెట్టుబడికి అనేక రెట్లు వసూళ్లను సాధించింది. అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దర్శకురాలు నందినీ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి 'తెలుగు మీడియం' అనే టైటిల్ ను కూడా ఆమె ఖరారు చేయాలనుకుంటున్నారు.

హిందీలో ఇర్ఫాన్ ఖాన్ చేసిన పాత్రకి తెలుగులో వెంకటేశ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతారనే ఆలోచనలో ఆమె వున్నారు. ఇక వెంకటేశ్ కూడా రీమేక్ లు చేయడానికి ఆసక్తిని చూపుతుంటారు గనుక, ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించే ఛాన్స్ ఉందనుకుంటున్నారు. వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సాధ్యమైనంత త్వరగానే సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో నందినీ రెడ్డి వున్నారు.   

More Telugu News