naga chitanya: సమంతకు, చైతూకు చెప్పకుండా సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన నాగ్, వెంకీ, రానా, అఖిల్!

  • సమంతకు స్వాగతం చెబుతూ ప్రత్యేక వీడియో
  • నటించిన అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలు
  • సమంతకు స్వీట్ షాకేనంటున్న బంధుగణం
  • పెళ్లి జరుగుతున్నప్పుడు వీడియో ప్రదర్శన

నేడు గోవాలో నిరాడంబరంగా నాగ చైతన్య, సమంతల వివాహం జరుగనుండగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కలసి సమంతకు వెల్ కమ్ చెబుతూ ఓ చిన్న వీడియోలో యాక్ట్ చేశారు. వివాహం జరుగుతున్నప్పుడు ప్రదర్శించేందుకు ఈ వీడియోను రూపొందించారని, దీని గురించి సమంత, చైతూలకు తెలియదని సమాచారం. సమంతకు సర్ ప్రైజ్ గా ఈ వీడియోను కానుకగా ఇవ్వాలని భావించిన రెండు ఫ్యామిలీలూ ఆమెకు స్వాగతం చెబుతూ కనిపిస్తాయట.

నాగార్జున, అమల, అఖిల్ తో పాటు వెంకటేష్, రానా, సుమంత్ తదితరులంతా ఈ వీడియోలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ వీడియో సమంతకు స్వీట్ షాకింగ్ గా ఉంటుందన్న నమ్మకంతో వీరంతా ఉన్నారట. కాగా, వీరిద్దరి వివాహం నేటి రాత్రి గోవాలో జరగనుండగా, ఫ్యాన్స్ చైతూ జంటకు శుభాభినందనలు చెబుతూ కామెంట్ల వరద పారిస్తున్నారు. ఎక్కువ మంది అభిమానులు, ఈ జంట తొలి చిత్రం 'ఏమాయ చేశావే' దర్శకుడు గౌతమ్ మీనన్ ను ప్రస్తావిస్తుండటం విశేషం. వీరిద్దరి ప్రేమకు బీజం వేసింది గౌతమేనని, ఆయన ఫోటోను పూజ గదిలో పెట్టుకుని జీవితాంతం పూజించుకోవాలని సలహాలు కూడా ఇస్తున్నారు.

More Telugu News