BSNL: రంగంలోకి బీఎస్ఎన్ఎల్.. త్వరలో సిమ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లు విడుదల

  • మైక్రోమ్యాక్స్, లావాతో ఒప్పందం
  • కొత్త వినియోగదారులను ఆకర్షించే వ్యూహం
  • వచ్చే ఏడాది నుంచి 4జీ సేవలు

టెలికం రంగంలో ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త వ్యూహంతో వస్తోంది. త్వరలోనే బీఎస్ఎన్ఎల్ సిమ్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా దేశీయ మొబైల్ మేకర్స్ మైక్రోమ్యాక్స్, లావా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కె.రామ్‌చంద్ తెలిపారు. సిమ్‌లను ఇప్పటికే ఆయా కంపెనీలకు పంపినట్టు చెప్పారు. ఇతర కంపెనీల నెట్‌వర్క్‌లకు తమ ఖాతాదారులు మారకుండా ఉండడంతోపాటు కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్లు తెస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

వచ్చే ఏడాది బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభం అవుతాయని రామ్‌చంద్ తెలిపారు. పండుగ సీజన్ సందర్భంగా విజయ్, లక్ష్మి అనే ఆఫర్లను ప్రకటించినట్టు చెప్పారు. విజయ్ ఆఫర్‌ కింద రూ.31 నుంచి రూ.299 వరకు రీచార్జ్ ప్లాన్లు ఉన్నాయని, వీటిలో దేనిని రీచార్జ్ చేసుకున్నా మెయిన్ ఖాతాకు 50 శాతం అధిక టాక్ వాల్యూ జత అవుతుందని వివరించారు. అలాగే లక్ష్మి ఆఫర్ కింద రూ.290, రూ.390, రూ.590లతో రీచార్జ్ చేసుకుంటే 50 శాతం అధిక టాక్ టైం లభిస్తుందని రామ్‌చంద్ వివరించారు.

More Telugu News