sunil gavaskar: బీసీసీఐ సెలక్టర్లపై మండిపడ్డ గవాస్కర్

  • ఆసీస్ పై వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన రహానే
  • టీ20లో రహానేను ఎందుకు సెలెక్ట్ చేయలేదన్న గవాస్కర్
  • రాహుల్ ను ఎందుకు ఎంపిక చేశారో చెప్పాలంటూ డిమాండ్

బీసీసీఐ సెలెక్టర్లపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నిప్పులు చెరిగారు. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్ కు గాను ఎంపిక చేసిన జట్టులో అజింక్య రహానేకు స్థానం కల్పించకపోవడాన్ని గవాస్కర్ తప్పుబట్టారు. ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో రహానే వరుసగా నాలుగు హాఫ్ పెంచరీలు సాధించి, మంచి ఫామ్ ఉన్నా... అతన్ని టీ20లకు ఎంపిక చేయకపోవడంపై సన్నీ మండిపడ్డారు.

ఇదే సమయంలో కేఎల్ రాహుల్ కు స్థానం కల్పించడాన్ని ఆయన ప్రశ్నించారు. రాహుల్ ను ఎంపిక చేయడానికి గల కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాహుల్ మంచి ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని... అయితే, ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని గవాస్కర్ గుర్తు చేశారు. వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలను చేసిన రహానేకు స్థానం కల్పించి ఉండాల్సిందని అన్నారు. ఐదు వన్డేల సిరీస్ లో రహానే వరుసగా 5, 55, 70, 53, 61 పరుగులు చేసి సత్తా చాటాడు.

More Telugu News