sai dharam tej: మారుతి కోసం తేజు వెయిట్ చేస్తాడా?

  • వినాయక్ మూవీ షూటింగులో సాయిధరమ్ తేజ్
  •  నెక్స్ట్ మూవీ మారుతి దర్శకత్వంలో చేయాల్సి వుంది
  •   చైతూ మూవీని మారుతి పూర్తి చేయడానికి సమయం పడుతుంది
  •  ఈ లోగా మరో దర్శకుడితో తేజు చేసే ఛాన్స్  

సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడనీ, గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

 ఎందుకంటే నాగచైతన్యతో మారుతి ఒక సినిమా చేయవలసి వుంది. డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాను మార్చిలో పూర్తి చేసే అవకాశం వుంది. ఏప్రిల్ లో తేజు సినిమాను మొదలెట్టడానికి ఛాన్స్ వుంది. కానీ వినాయక్ సినిమాను పూర్తి చేసేసిన తరువాత, ఏప్రిల్ వరకూ తేజు ఖాళీగా ఉండకపోవచ్చని చెప్పుకుంటున్నారు. ఈ గ్యాప్ లో తేజు మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ తరువాతనే మారుతితో కలిసి సెట్స్ పైకి వెళతాడేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       

More Telugu News