mohanbabu: ఆకలితో అలమటిస్తున్న నన్ను అమ్మలా కాపాడింది: మోహన్ బాబు ఉద్వేగం

  • నన్ను ఆదుకుంది తమిళనాడే
  • దాసరి నాకు అండగా నిలబడ్డారు
  • శివాజీ గణేశన్ వల్ల తమిళంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నా

తమిళనాడులో అడుగుపెడితే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మద్రాసువాసులే తనను ఆదుకున్నారని... ఆకలితో అలమటిస్తున్న తనను తల్లిలా కాపాడింది తమిళనాడేనని ఉద్వేగంగా చెప్పారు. నిన్న ఎంజీఆర్ యూనివర్శిటీ 26వ స్నాతకోత్సవం సందర్భంగా మోహన్ బాబుకు గౌరవ డాక్టరేట్ ను అందించారు. ఈ సందర్భంగా ఆయన తమిళంలో ప్రసంగించి, అందరినీ ఆకట్టుకున్నారు.

చెన్నైలోని వైఎంసీఏలో డ్రిల్ మాస్టర్ గా, టీనగర్ లోని కేసరి స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశానని మోహన్ బాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సినిమా చాన్సుల కోసం పడరాని పాట్లు పడుతున్న తనను... దాసరి నారాయణరావు ఆదుకున్నారని చెప్పారు. శివాజీ గణేశన్ తనను తమిళ పరిశ్రమకు విలన్ గా పరిచయం చేశారని తెలిపారు. శివాజీ గణేశన్ అండ వల్లే తాను తమిళంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నానని చెప్పారు. అప్పటి రోజులను తలచుకుంటే ఇప్పటికీ ఉద్వేగానికి లోనవుతానని అన్నారు. తన మిత్రుడు, గవర్నర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా డాక్టరేట్ ను స్వీకరించడం ఆనందంగా ఉందని చెప్పారు.

More Telugu News