Shanvi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • చైనీస్ వెబ్ సీరీస్ లో శాన్వి 
  • 'హేయ్.. పిల్లగాడ' సెన్సార్ పూర్తి 
  • ప్రీ ప్రొడక్షన్ దశలో 'సంఘమిత్ర'  

*  గతంలో లవ్లీ, అడ్డా వంటి తెలుగు చిత్రాలలో నటించిన కథానాయిక శాన్వీ గత కొంత కాలంగా కన్నడ సినిమాలను చేస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు చైనీస్ వెబ్ సీరీస్ లో నటించే ఛాన్స్ వచ్చింది. 'ది డార్క్ లార్డ్' పేరిట రూపొందుతున్న ఈ సీరీస్ లో నటించడం పట్ల శాన్వి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. భారత్- చైనా సంబంధాల నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ రూపొందుతోంది.      
*  దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన 'కలి' మలయాళ చిత్రాన్ని తెలుగులోకి 'హేయ్.. పిల్లగాడ' పేరుతో అనువదించారు. తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది.ఈ నెలలోనే విడుదల కానున్న ఈ చిత్రానికి సమీర్ తాహిర్ దర్శకత్వం వహించాడు.  
*  సుందర్ సి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్టుతో 'సంఘమిత్ర' పేరిట ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. అయితే, శ్రుతి హాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దర్శకుడి భార్య ఖుష్బూ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తారు.     

More Telugu News