samanta: అక్కినేని వారి పెళ్లి సందడి మొదలైంది!

  • మూడు రోజుల ముందే గోవా చేరుకున్న నాగచైతన్య, సమంత
  • రేపు హిందూ సంప్రదాయంలో వివాహం
  • ఎల్లుండి క్రైస్తవ సంప్రదాయంలో వెడ్డింగ్ 
  • ఒక్కొక్కరుగా చేరుకుంటున్న కుటుంబ సభ్యులు

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ పెళ్లి సందడి మొదలైంది. రేపు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సమంత, నాగచైతన్య జంట మూడు రోజుల క్రితమే గోవా చేరుకుని పెళ్లిపనుల్లో మునిగిపోయారని సమాచారం. బంధువులు కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు.

కాగా, రేపు పూర్తి హిందూ తెలుగు సంప్రదాయం ప్రకారం వివాహం జరగనుండగా, ఎల్లుండి పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో వెడ్డింగ్ జరగనుంది. హిందూ సంప్రదాయ వివాహానికి ప్రత్యేకంగా చీర డిజైన్ చేయించుకున్న సమంత, క్రైస్తవ సంప్రదాయానికి ఈ మధ్యే క్రేశా బజాజ్ ఫోటో షూట్ లో వేసుకున్న వెడ్డింగ్ గౌను, నెక్లెస్ ధరించనుంది.

ఇక అక్కినేని, దగ్గుబాటి, సమంత కుటుంబాలు నేటి సాయంత్రానికి గోవా చేరుకోనున్నట్టు తెలుస్తోంది. నిన్న గోవాలో చైతన్య, సమంత తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

More Telugu News