trump: వావ్.. ఈ రోజు చాలా ఫేక్ న్యూస్ స్టోరీలు వ‌చ్చాయి: అమెరికా అధ్య‌క్షుడు

  • తరుచూ మీడియాపై విరుచుకుపడే ట్రంప్
  • మీడియాను మ‌రోసారి ఎద్దేవా చేసిన అధ్యక్షుడు 
  • మీడియా నిజాల‌ని రాయ‌దు, చెప్ప‌దు
  • నియంత్రణ కోల్పోయింది

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మీడియా అంటే ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న అప్పుడప్పుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా మీడియాపై విరుచుకుప‌డుతూనే ఉంటారు. త‌న‌కి మీడియా క‌న్నా ట్విట్ట‌ర్ అంటేనే ఇష్ట‌మ‌ని ఆయ‌న చెబుతుంటారు. తాజాగా మీడియాను ట్రంప్ మ‌రోసారి ఎద్దేవా చేశారు. ‘వావ్.. ఈ రోజు చాలా ఫేక్ న్యూస్ స్టోరీలు వ‌చ్చాయి.. నేను స‌రిగ్గా ఏం చెప్పానో, ఏం చేస్తున్నానో మీడియాకు తెలుసుకోవాల్సిన అవ‌స‌ర‌మేలేదు. మీడియా నిజాల‌ని రాయ‌దు, చెప్ప‌దు. ఫేక్ న్యూస్ మీడియా నియంత్ర‌ణ కోల్పోయింది’ అని డొనాల్డ్ ట్రంప్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

More Telugu News