‘మా’: ‘మా’ ఫిర్యాదు మేరకు అశ్లీల వెబ్ సైట్లపై కేసు నమోదు!

  • అశ్లీల పోస్ట్ లు చేసే వెబ్ సైట్లు, యూ ట్యూబ్ ఛానెల్స్ ను వదలం
  • సినిమా వాళ్లే కాదు, ఎవరు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం
  •  సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక

సినీ ప్రముఖుల ఫొటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర వ్యాఖ్యలతో  పోస్ట్ లు చేస్తున్న వెబ్ సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోరిన విషయం తెలిసిందే. అశ్లీల వెబ్ సైట్లపై ఐటీ యాక్ట్ 67, 67ఏ కిందు కేసులు నమోదు చేసినట్టు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా సైబర్ క్రైం ఎస్పీ రామ్మోహన్ మాట్లాడుతూ, వెబ్ సైట్లు, యూ ట్యూబ్ ఛానెల్స్ ఎక్కడి నుంచి ఈ తరహా పోస్ట్ లు చేసినా పట్టుకుంటామని హెచ్చరించారు. ఏ దేశం నుంచి ఆపరేట్ చేసినా నిర్వాహకులను వదిలిపెట్టమని, సినిమా వాళ్లే కాదు, ఎవరు ఫిర్యాదు చేసినా నిందితులను వదలమని, వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కేవలం సినిమా వాళ్లనే కాదు, అశ్లీలంగా ఎవరిని చూపించినా శిక్షార్హులేనని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

More Telugu News