america: 'ఐ ఫోన్‌' నా ప్రాణాలు కాపాడింది!: 'లాస్ వెగాస్' కాల్పుల నుంచి బయటపడిన యువతి

  • లాస్‌వెగాస్‌లో కాల్పుల నుంచి తృటిలో త‌ప్పించుకున్న యువతి
  • హోటల్ నుంచి బయటకు వచ్చేసి క్యాబ్ ఎక్కి ఇంటికి పయనం
  • డ్యామేజ్ అయిన ఫోన్ ను డ్రైవర్ కు చూపించిన యువతి

అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఓ హోటల్లో మ్యూజిక్ ఫెస్ట్ జరుగుతోన్న సమయంలో ఓ వ్య‌క్తి కాల్పులు జ‌రిపి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆ కాల్పుల నుంచి తాను తృటిలో త‌ప్పించుకున్నాన‌ని ఓ అమెరికా యువ‌తి అంటోంది. కాల్పులు జ‌రిగిన స‌మయంలో తాను అక్క‌డే ఉన్నాన‌ని, త‌న‌ ఐఫోన్ 7 ప్లస్ మొబైల్‌కు ఓ బుల్లెట్ తాకింద‌ని, దీంతో ఆ బుల్లెట్ అక్క‌డే ఆగిపోయింద‌ని, లేకపోతే తన ప్రాణాలు పోయేవని తెలిపింది.

అనంతరం తాను ఘటనాస్థలి నుంచి బయటకు వచ్చేసి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్లిన‌ట్లు పేర్కొంది. క్యాబ్‌లో వెళుతూ డ్రైవర్‌కు తన యాపిల్‌ ఐఫోన్‌ 7ప్లస్‌ను చూపించింది. ఆ ఐఫోన్ వెనుకవైపు బుల్లెట్‌ తాకి డ్యామేజ్ అయిపోయింది. ఈ యువతి పేరు మాత్రం మీడియాకు తెలియ‌రాలేదు.

More Telugu News