హనీప్రీత్ ఏడుపు: కోర్టులో న్యాయమూర్తి ముందు బావురుమన్న హనీప్రీత్!

  • హ‌ర్యానాలోని పంచ‌కుల కోర్టులో హాజ‌రు
  • తనకే పాపం తెలియదన్న హనీప్రీత్
  • ఆరు రోజుల పాటు పోలీస్‌ కస్టడీ
  • డేరా బాబా ఆగడాలపై ప్రశ్నించనున్న పోలీసులు

అత్యాచారం కేసులో శిక్ష అనుభ‌విస్తోన్న డేరా సచ్చా సౌధా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్ సన్నిహితురాలు హనీప్రీత్ ఇన్సాన్‌ను నిన్న పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆమెను హ‌ర్యానాలోని పంచ‌కుల కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా ఆమె క‌న్నీరు పెట్టుకుంది. ఆమెపై పోలీసులు దేశ‌ద్రోహం, డేరా బాబాను త‌ప్పించే య‌త్నం కింద కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసుల్లో ఆమె కోర్టులో స‌మాధానం చెబుతూ త‌నకు ఏ పాపం తెలియ‌ద‌ని వాపోయింది.

కాగా, కోర్టు ఆమెను ఆరు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. డేరా బాబాతో ఆమెకున్న సంబంధం, ఆశ్రమంలో జ‌రిగిన‌ అరాచకాలు, హ‌ర్యానా, పంజాబ్‌ల‌తో పాటు ప‌లు రాష్ట్రాలో చెల‌రేగిన హింస‌పై పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు. 

More Telugu News