priyanka chopra: మరో బయోపిక్ లో నటిస్తున్న ప్రియాంకచోప్రా!

  • పీటీ ఉష బయోపిక్ లో ప్రియాంక
  • రేవత్ ఎస్ వర్మ దర్శకత్వం
  • రెహమాన్ ను సంప్రదిస్తున్న యూనిట్

బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. వివిధ క్రీడాకారుల జీవితాలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మరో బయోపిక్ తెరకెక్కడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే బాక్సర్ మేరీకోమ్ బయోపిక్ లో నటించిన ప్రియాంక చోప్రా... తాజాగా మరో బయోపిక్ లో నటించడానికి రెడీ అయింది.

ఈ సినిమా పరుగుల రాణి పీటీ ఉష జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దక్షిణాది దర్శకురాలు రేవతి ఎస్ వర్మ భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను సంప్రదిస్తున్నారట. తమిళ, మలయాళ భాషల్లో రేవతి సినిమాలు రూపొందించారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ, పీటీ ఉషను ఒప్పించడానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పారు. 

More Telugu News