nara rohith: షూటింగ్ పూర్తి చేసుకున్న 'బాలకృష్ణుడు'

  •  నారా రోహిత్ తాజా చిత్రంగా 'బాలకృష్ణుడు'
  •  రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసిన పవన్ మల్లెల
  •  ఈ నెలాఖరులో ఆడియో రిలీజ్
  •  కథానాయికగా రెజీనా  

నారా రోహిత్ కథానాయకుడిగా పవన్ మల్లెల దర్శకత్వంలో 'బాలకృష్ణుడు' సినిమా రూపొందింది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. పాత్రకి తగినట్టుగా ఉండటం కోసం ఆయన ఎంతో కసరత్తు చేశాడు.

 స్మార్ట్ గా .. మరింత హ్యాండ్సమ్ గా న్యూ లుక్ తో ఆయన ఆడియన్స్ ను ఆశ్చర్యపరచనున్నాడు. ఈ సినిమా నుంచి త్వరలోనే టీజర్ ను వదలనున్నారు. ఈ నెలాఖరులో ఆడియో వేడుకను ఘనంగా జరపనున్నారు. నారా రోహిత్ సరసన కథానాయికగా రెజీనా నటించింది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నారా రోహిత్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.     

More Telugu News