hover board: వాకిలి ఇలా కూడా శుభ్రం చేయొచ్చా?... వైర‌ల్‌గా మారుతున్న పాకిస్థానీ మ‌హిళ వీడియో

  • హోవ‌ర్ బోర్డ్ సాయంతో వాకిలి శుభ్రం
  • సాంకేతిక‌త‌కు కొత్త అర్థం చెబుతోందంటూ ప్ర‌శంస‌
  • పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్న నెటిజ‌న్లు

సాధార‌ణంగా పెద్ద పెద్ద ప్రాంగ‌ణాలు, వాకిళ్లను చీపురు ప‌ట్టుకుని శుభ్రం చేయాలంటే చాలా క‌ష్టంగా ఉంటుంది. ఎక్కువ‌ సేపు న‌డుము వాల్చి ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా నొప్పి క‌లుగుతుంది. ఆ క‌ష్టం నుంచి గ‌ట్టెక్క‌డానికి ఈ పాకిస్థానీ మ‌హిళ ఓ కొత్త విధానాన్ని క‌నిపెట్టింది. త‌న రోజువారీ వాకిలి శుభ్రం ప‌నికి కొద్దిగా సాంకేతిక‌త‌ను జోడించింది.

హోవ‌ర్ బోర్డ్ మీద కూర్చుని వాకిలి మొత్తం శుభ్రం చేసింది. ఆమె అలా శుభ్రం చేస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంతేకాదండోయ్‌... ఈ వీడియో చూసిన‌వారంతా ఆ మ‌హిళ సాంకేతిక‌త‌కు కొత్త అర్థం చెప్పిందంటూ ప్ర‌శంసిస్తున్నారు. `ఆమె 3017 సంవ‌త్స‌రానికి చెందిన మ‌హిళ‌` అని, `హోవ‌ర్ బోర్డ్‌ను 100 శాతం వాడుతోంది` అని ఇలా ర‌కర‌కాల న‌వ్వు పుట్టించే కామెంట్లు చేస్తున్నారు.

More Telugu News