vikram: విక్రమ్ హిట్ మూవీ సీక్వెల్ కి టైటిల్ ఫిక్సయింది!

  •  హరి దర్శకత్వంలో విక్రమ్
  •  గతంలో వచ్చిన 'సామి'కి ఇది సీక్వెల్
  •   తాజా చిత్రానికి 'సామి స్క్వేర్' టైటిల్ ఫిక్స్
  •  కథానాయికగా కీర్తి సురేశ్    

ప్రయోగాత్మక చిత్రాలను కొంతకాలం పక్కన పెట్టేసి, సినిమాల సంఖ్యను .. వేగాన్ని పెంచాలని విక్రమ్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే తమిళంలో మూడు సినిమాలు సెట్స్ పై వున్నాయి. వాటిలో 'స్కెచ్' మూవీ ఆడియో రిలీజ్ కి రెడీ అవుతోంది. విజయ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించింది.

 ఇక హరి దర్శకత్వంలో విక్రమ్ ఒక సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సామి' సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాకి 'సామి 2' అనే టైటిల్ ను ఖరారు చేస్తారనే టాక్ వచ్చింది. కానీ తాజాగా ఈ సినిమాకి 'స్వామి స్క్వేర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ ఇలా ఎందుకు పెట్టవలసి వచ్చిందనే దానికి ఆన్సర్ సినిమా చూశాక తెలుస్తుందంటూ హరి ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ కి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.    

More Telugu News