infrastructure: స్థిరాస్తి సంస్థ‌ల బాధితులకు అండగా సుప్రీంకోర్టు!

  • జేపీ ఇన్‌ఫ్రాటెక్ కేసులో తీర్పు
  • డబ్బులు తిరిగి చెల్లించేలా లేదా ఫ్లాట్లు సొంత‌మ‌య్యేలా చ‌ర్య‌లు
  • స్ప‌ష్టం చేసిన‌ దీప‌క్ మిశ్రా ధ‌ర్మాస‌నం

`త‌క్కువ ధ‌ర‌కే సొంత ఇల్లు మీ సొంతం` అంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి, డ‌బ్బు చెల్లించాక బోర్డు తిప్పేసే స్థిరాస్తి సంస్థ‌ల విష‌యంపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. అలాంటి సంస్థ‌ల కార‌ణంగా మోస‌పోయిన వారికి సాయ‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకుంది. స్థిరాస్తి సంస్థ‌ల వ‌ల్ల ఇబ్బందుల‌కు గుర‌వుతున్న గృహ కొనుగోలుదారుల‌కు ఫ్లాట్లు సొంతమయ్యేలా లేదా డబ్బులు తిరిగి చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది.

దివాలా స్మృతి, 2016లోని నిబంధనలను సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జేపీ విష్‌టౌన్‌లో 2013లోనే డ‌బ్బు చెల్లించిన‌ప్ప‌టికీ ఇంకా ఫ్లాట్లు కేటాయించ‌లేద‌ని 40 మందికిపైగా గృహ కొనుగోలుదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ఇలాంటి విషయాల్లో మరిన్ని లిటిగేషన్లను తాము కోరుకోవడం లేదనీ, గృహ కొనుగోలుదారులకు సహాయ పడాలనుకుంటున్నామని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. స్థిరాస్తి సంస్థ‌ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా దివాలా కేసుల విచారణపై ఇప్పటికే కోర్టు సహాయకుడిని నియమించామని తెలిపింది.

More Telugu News