nagarjuna: 'రాజుగారి గది 3' చేసే అవకాశం కూడా వుంది : నాగార్జున

  • 'రాజుగారి గది 2' కథ నచ్చడం వల్లనే చేశాను
  •  అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది
  •  ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం
  •  అదే జరిగితే 'రాజుగారి గది 3' కూడా ఉంటుంది  

నాగార్జున ప్రధాన పాత్రధారిగా చేసిన 'రాజుగారి గది 2' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, తాను చేసిన మొదటి హారర్ థ్రిల్లర్ మూవీ ఇదేనని చెప్పారు. గతంలో హారర్ థ్రిల్లర్ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా తాను చేయలేదనీ, ఆ కథల్లో తాను ఆశించిన థ్రిల్  కనిపించకపోవడమే అందుకు కారణమని అన్నారు.

 ఈ సినిమా కథ .. తన పాత్ర తీరుతెన్నులు నచ్చడం వల్లనే ఒప్పుకున్నానని చెప్పారు. ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందనీ, మంచి విజయాన్ని సాధించడం ఖాయమని అన్నారు. తాము ఆశించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తే, 'రాజుగారి గది 3' కూడా చేసే ఛాన్స్ ఉందని చెప్పారు. శీరత్ కపూర్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఆత్మగా సమంత కనిపించనున్న సంగతి తెలిసిందే.    

More Telugu News