siddharth: భయానక సంఘటనలకు నిలయమైన 'గృహం'

  •  హారర్ నేపథ్యంలో సిద్ధార్థ్ మూవీ
  •  మూడు భాషల్లో నిర్మాణం
  •  తెలుగు టైటిల్ 'గృహం'
  •  నవంబర్లో విడుదల

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో హీరోగా సిద్ధార్థ్ కి మంచి గుర్తింపు వుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకి సరైన హిట్ పడలేదు. ఇక తెలుగులోనైతే చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు.

 హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో 'అవళ్' .. హిందీలో 'ద హౌస్ నెక్స్ట్ డోర్' ..  తెలుగులో 'గృహం' పేరుతో ఆడియన్స్ ను పలకరించనుంది. నవంబర్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హారర్ నేపథ్యంతో కూడిన సన్నివేశాలపైనే ఈ టీజర్ ను కట్ చేశారు. విజువల్స్ ఆసక్తిని రేకెత్తించేలా వున్నాయి. మిళింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సిద్ధార్థ్ కి హిట్ దక్కుతుందేమో చూడాలి. 

More Telugu News