donkey milk: కాలం మారింది... వేమన మాట మారుతోంది... 'ఖరము'పాలకి మహా డిమాండ్!

  • ఆవుపాలు 44 రూపాయలే
  • గాడిదపాలు లీటర్ వెయ్యి రూపాయలు
  • అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో జోరుగా వ్యాపారం
  • 50 ఎంఎల్ గాడిదపాలు 50 రూపాయలు

కాలం మారేకొద్దీ కొన్ని విషయాల్లో అభిప్రాయాలు మారుతుంటాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. 'గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు' అంటూ యోగి వేమన చెప్పిన సంగతి తెలిసిందే. అంటే గాడిద పాలు ఎన్ని వున్నా వృథా, ఎందుకూ పనికిరావు.. అన్న అర్థంలో వేమన మహాశయుడు సెలవిచ్చాడు. అయితే ఇప్పుడు ఈ గాడిద పాలే మహా ప్రసాదం అంటున్నారు వ్యాపారులు. ఆవుపాలు లీటర్ 44 రూపాయలు. కానీ లీటర్ గాడిద పాలు వెయ్యి రూపాయల ధరపలుకుతున్నాయి. గాడిదపాలు తాగితే సర్వరోగాలు నయమవుతాయన్న పుకార్ల నేపథ్యంలో ఆ పాలు తాగేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.

 అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో గాడిదపాలు తాగితే సర్వరోగాలు నయమవుతాయని ప్రచారం చేస్తూ మంచిర్యాలకు చెందిన వడియాల రాజులు విక్రయం సాగిస్తున్నాడు. 50 ఎంఎల్ పాలు 50 రూపాయలకు అమ్ముతున్నాడు. 40 గాడిదలతో మకాం వేసిన రాజులు వాటిని వీధుల్లో తిప్పుతూ అడిగిన వారికి పాలు పితికి ఇస్తున్నాడు. పాలలో ఆయుర్వేద దినుసులు కలిపి ఇస్తూ, అవి తాగితే ఉబ్బసం, ఆయాసం తగ్గుతాయని ప్రచారం చేస్తున్నాడు. దీంతో గాడిదపాలు మంచి ధరపలుకుతున్నాయి. 

More Telugu News