jc divakar reddy: అందరూ రాజీనామా చేస్తానంటే ఎలా?: జేసీ దివాకర్‌రెడ్డి

  • రాజీనామా చేయాలంటే ద‌మ్ము ఉండాలి
  • నా డిమాండ్ల ప‌ట్ల‌ చంద్రబాబు సానుకూలంగా స్పందించారు
  • అనంత‌పురంలో అభివృద్ధి జ‌రుగుతోంది

తన నియోజ‌క వ‌ర్గానికి ఏమీ చేయ‌లేక‌పోతున్నాన‌ని, తాను ఇక రాజీనామా చేసేస్తాన‌ని ప్ర‌క‌టించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మ‌ళ్లీ వెన‌క్కు త‌గ్గిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆయ‌న‌ను మీడియా ఈ విష‌యమై ప్రశ్నించ‌గా.. రాజకీయాల్లో రాజీనామా చేయాలంటే ద‌మ్ము ఉండాలని వ్యాఖ్యానించారు. అందరూ రాజీనామా చేస్తానంటే ఎలా? అని ఎదురు ప్ర‌శ్న వేశారు. తన డిమాండ్ల ప‌ట్ల‌ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించార‌ని, స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపార‌ని అన్నారు. అనంత‌పురంలో అభివృద్ధి జ‌రుగుతోంద‌ని చెప్పుకొచ్చారు.    

More Telugu News