kancha ilaiah: కంచ ఐలయ్యను అవమానపరుస్తున్నారని ఎస్సీ, బీసీ సంఘాల ఆందోళన.. పోటీగా వైశ్యుల నిరసన!

  • క‌ర్నూలులో కంచ ఐలయ్య ఫొటోల‌తో డోర్‌ మ్యాట్ల విక్రయాలు
  • ఆగ్ర‌హించిన ఎస్సీ, బీసీ సంఘాలు
  • కొండారెడ్డి బురుజు దగ్గర బైఠాయించిన వైశ్యులు

‘సామాజిక స్మగ్ల‌ర్లు కోమ‌టోళ్లు’ అంటూ ప్రొ.కంచ ఐల‌య్య రాసిన పుస్త‌కంపై ఆర్య‌వైశ్యులు భ‌గ్గుమంటోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కంచ ఐల‌య్య‌ ఫొటోల‌తో క‌ర్నూలు పాత‌బ‌స్తీలో డోర్‌ మ్యాట్లను త‌యారుచేసి అమ్ముతున్నారు. దీంతో ఆగ్ర‌హించిన ఎస్సీ, బీసీ సంఘాలు ఆ ప్రాంతంలోని వైశ్యుల దుకాణాల ముందు బైఠాయించి నిర‌స‌న తెలిపాయి. దీంతో వైశ్యులు పోటాపోటీ నిర‌స‌న‌కు దిగారు. తాము అటువంటి డోర్ మ్యాట్లు అమ్మడం లేదని చెప్పుకొచ్చారు. అంతేగాక‌, పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి కొండారెడ్డి బురుజు దగ్గర కాసేపు బైఠాయించి, అనంత‌రం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.    

More Telugu News