బంగారం ధర: ఏడు వారాల కనిష్ఠానికి ప‌డిపోయిన బంగారం ధర

  • ఏడు వారాల కనిష్ఠానికి పసిడి ధర
  • పది గ్రాముల ప‌సిడి ధర రూ.30,550
  • కేజీ వెండి ధ‌ర‌ రూ.40,200

మార్కెట్‌లో బంగారం ధర ఏడు వారాల కనిష్ఠానికి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ త‌గ్గ‌డంతో ప‌సిడి ధ‌ర ఈ రోజు రూ.200 ప‌డిపోయింది. దీంతో పది గ్రాముల ప‌సిడి ధర రూ.30,550గా న‌మోదైంది.

 మరోవైపు వెండి ధర కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేక‌పోవ‌డంతో రూ.600 తగ్గింది. దీంతో కేజీ వెండి ధ‌ర‌ రూ.40,200గా న‌మోదైంది. గ్లోబ‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధర 0.14 శాతం తగ్గి, ఔన్సు 1,268.70 డాలర్లుగా న‌మోదైంది.   

More Telugu News