vijay malya: లండన్ లో విజయ్ మాల్యా అరెస్టు!

  • బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా
  • మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి లండన్ కోర్టుకు ఆధారాల‌ సమర్పణ 
  • మాల్యాను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం

భార‌తీయ బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యాను అక్కడి పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఆయ‌న‌పై భార‌త్‌లో మనీలాండరింగ్ కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఆయ‌న కేసుకు సంబంధించిన పలు ఆధారాల‌ను సీబీఐ, ఈడీ అధికారులు లండ‌న్ లోని న్యాయస్థానానికి అందించారు. ఈ క్రమంలో విజ‌య్ మాల్యాను మ‌రోసారి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టనున్న‌ట్లు తెలుస్తోంది. విజ‌య్ మాల్యాను అరెస్టు చేసిన అంశంపై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది.

More Telugu News